దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరగడం జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది.. తాజాగా తమిళనాడు లో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు.. తమిళనాడు లో దారుణ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడి మృతి చెందారు.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ దారుణ ఘటన తో రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది.. తమిళనాడు తిరుచ్చి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ప్రభుత్వ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మనపరైలోని వాయంబట్టి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తిరుచ్చి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు..
వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా వేగాన్ని కంట్రోల్ చెయ్యలేక బస్సును ఢీ కొట్టినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాద సమయంలో 35 మంది బస్సులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు బోల్తా కొట్టినట్లు తెలుస్తుంది.. కారు డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని అదుపు చెయ్యలేక పోవడంతో బస్సును ఢీ కొట్టింది..
తిరుచ్చి జిల్లాలోని మనపరైలోని వాయంబట్టి సమీపంలో జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగినట్లు తిరుచ్చి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుజిత్ కుమార్ తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. టైరు పగిలిపోవడం తో కారు అదుపు తప్పి ప్రభుత్వ బస్సును ఢీకొట్టిందని తెలిపారు. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ఉన్న 34 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
