Suspicious Death: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంచెపాళ్యలో నివసిస్తున్న అభిషేక్, స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని అభిషేక్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇక, పెళ్లి తర్వాత స్పందనను కట్నం కోసం వేధించడం ప్రారంభించినట్లు సమాచారం. అత్తింటి వేధింపుల గురించి బాధపడుతూ స్పందన తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చేది. ఈ వ్యవహారంపై ఇరు కుటుంబాల పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరించి ఇటీవల రూ.5 లక్షలు కూడా ఇచ్చారు.
Read Also: PM Modi: మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామ్య నేతగా మోడీ రికార్డ్.. టాప్-5లో కనపడని ట్రంప్..!
కానీ, గురువారం భీమన అమావాస్య సందర్భంగా భర్త అభిషేక్ కు పాదపూజ చేసిన స్పందన, ఆ మరుసటి రోజు శుక్రవారం ఉదయం మృతదేహమై కనిపించింది. ఈ విషాదవార్తను తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్పందన మృతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ కలిసి ఆమెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, ఈ హత్య వెనుక ఉన్న నిజాలను బయటపెట్టే క్రమంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అత్తింటి వారిపై ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
