Tragedy: గుజరాత్‌లోని సూరత్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో ‘‘వివాహేతర సంబంధం’’ ఉందనే కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత వ్యక్తిని అల్పేష్ భాయ్ కాంతిభాయ్ సోలంకి(41)గా గుర్తించారు. అల్పేష్ తన 7,2 ఏళ్ల ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు, ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రేమికుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Transgender In Court: కోర్టులో ట్రాన్స్‌జెండర్ వీరంగం.. బట్టలు చించుకొని రచ్చ రచ్చ!
సూరత్ నగరంలోని దిండోలి పట్టణంలోని ఒక పాఠశాలలో అల్పేష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఫాల్గుణి భాయ్ జిల్లా పరిషత్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తోంది. ‘‘అల్పేష్‌కి ఆయన భార్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఇంటికి వచ్చి చూసింది. ఆ సమయంలో ఇంటి తలుపులు లోపల నుంచి లాక్ చేయబడి ఉన్నాయి. ఆమె తన బంధువులకు ఫోన్ చేసి, తలుపులు పగలగొట్టి చూడగా, మంచంపై పిల్లలు, సమీపంలో అల్పేష్ చనిపోయి కనిపించారు.’’ అని సూరత్ డీసీసీ విజయ్ సింగ్ గుర్జార్ అన్నారు.
వ్యక్తి మొబైల్‌లో సూసైడ్ నోట్, రెండు డైరీలు కొన్ని వీడియోలు లభించాయని పోలీసులు తెలిపారు. అల్పేష్ భాయ్ సోదరుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడి భార్య ఫాల్గుణి భాయ్‌కి నరేష్ కుమార్ రాథోడ్ అనే వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపించాడు. ఈ వ్యవహారంతోనే అల్పేష్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, దాని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. గత ఒకటి రెండు నెలలుగా తన డైరీలో ఈ విషయాలను రాస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం కారణంగా తాను ఒత్తిడిలో ఉన్నట్లు డైరీలో పేర్కొన్నాడు. రెండో డైరీలో తన భార్య గురించి వివరంగా ప్రస్తావించాడు. ఈ వివాహేతర సంబంధంపై తరుచుగా ఈ జంట గొడవల్లో పాల్గొంటున్నట్లు పోలీసులు తెలిపారు.
