Boat Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘాజీపూర్ జిల్లాలోని రేవతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అథోటా గ్రామంలో బుధవారం 17 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. పడవలో ఎక్కువగా వరద బాధితులు, కూలీలు ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) సహాయంతో డైవర్లు పది మందిని రక్షించారని, అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఘాజీపూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అంతకుముందు ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. శుక్రవారం అర్థరాత్రి మరో మృతదేహాన్ని వెలికితీశారని రోహన్ పి బోత్రే తెలిపారు. మృతులను శివశంకర్ అలియాస్ డబ్లు గ్వార్, నగీనా పాశ్వాన్‌గా గుర్తించారు.
ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంలో నష్టపోయిన ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ఘాజీపూర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యంగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్, చందౌలీ, వారణాసిలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
MLA Slapped by Her Husband: ఎమ్మెల్యేను చాచిపెట్టి కొట్టిన భర్త.. వీడియో వైరల్
ఘాజీపూర్‌లోని వరద సహాయక శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “రాజస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరదల వంటి పరిస్థితుల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం అత్యంత సున్నితత్వంతో యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది. బాధిత కుటుంబాలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తున్నారు.” ఇంకా వరద బాధిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోందని యోగి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 1100 గ్రామాలు ప్రభావితమయ్యాయి, వీటిలో ఘాజీపూర్‌లో 33 ఉన్నాయి, వీటిలో 7000 కంటే ఎక్కువ కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వం ప్రజలకు వారి ఇంటి వద్దే ఆహార ధాన్యాలను అందిస్తోంది. వారిని రక్షించడానికి ఎటువంటి దారిని వదలడం లేదని ముఖ్యమంత్రి యోగి అన్నారు. ఘాజీపూర్‌లోనే దాదాపు 288 పడవలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా, ప్రభావితమైన సుమారు 5,000 జంతువులను సహాయక కేంద్రాలకు తరలించారు. ముఖ్యమంత్రి చందౌలీలో వరద బాధిత ప్రాంతాలను క్షుణ్ణంగా ఏరియల్ తనిఖీ చేశారు, తరువాత వారణాసిలో వరద-సహాయక శిబిరాలను సందర్శించి అక్కడ సహాయక సామగ్రిని పంపిణీ చేశారు.
