ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొంది. విద్యను నేర్పించి ఉన్నత స్టయిల్లో నిలబెట్టాల్సిన ఒక ఉపాధ్యాయుడు నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థులను కన్నబిడ్డలుగా చూడాల్సింది పోయి వారిపై కామంతో కన్నేసి వారిని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం వారి నగ్న వీడియోలను చిత్రీకరించి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిని అనుభవిస్తున్నాడు. ఇక ఇతడి గురించి పోలీసులకు చెప్పినా ఊర్లో పెద్దమనిషి కావడంతో పోలీసులు సైతం పట్టించుకోవడంలేదని బాధితుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు(48) ప్రైవేట్ స్కూల్ ని నడుపుతున్నాడు. ఆ స్కూల్ లో చదివే వారందరు పేదవారు.. ఇక ఇదే అదునుగా భావించిన ఉపాధ్యాయుడు అక్కడ చదివి విద్యార్థునులపై కన్నేశాడు. 10 వ తరగతి చదివే విద్యార్థునులపై స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి 17 మంది విద్యార్థులను ఇంటికి రప్పించాడు. వారికి భోజనంలో మత్తుమంది కలిపి తినిపించాడు.
అనంతరం వారిపై అతడు, అతడి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి నగ్న వీడియోలను చిత్రీకరించి బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదురు బాలికలు మౌనంగా ఉండిపోగా ఇద్దరు బాలికలు మాత్రం దైర్యం చేసి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా .. సదురు ఉపాధ్యాయుడు ఊర్లో పెద్దమనిషిగా చెలామణి కావడంతో అతడిపై యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు కూడా జంకుతున్నారని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొద్దిరోజుల నుంచి పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు కామాంధుడిని అరెస్ట్ చేశారని , అతడి స్నేహితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
