Site icon NTV Telugu

Medchal Crime: దారుణం.. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి..

Man Harassed Beautician

Man Harassed Beautician

Sanjeeva Reddy Harassed Beautician In Jeedimetla: ఎన్ని చట్టాలు తెస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటోన్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంలో ఓ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఓ కీచకుడు పలుమార్లు అత్యాచారలకు పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు ఓ బ్యూటీషియన్. ఈమెకు స్నేహితుల ద్వారా సంజీవరెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

మొదట్లో తన పట్ల మంచిగా ప్రవర్తించడంతో.. ఆమె అతడ్ని నమ్మింది. కానీ, కొన్ని రోజుల తర్వాత అతడు తన నిజ స్వరూపం బయటపెట్టాడు. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె పుట్టినరోజు నాడు కూడా ఆ కామాంధుడు విడిచిపెట్టలేదు. ఇంటికి వెళ్లి, బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన స్నేహితులకు చెప్పింది. దీంతో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version