సంగారెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి దొరకక దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయం చేసి జైలు అధికారులకు చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మా నియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు.
ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల సంగా రెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు ఖైదీలు సెప్టెంబరు 15న జైలులోని గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేశారు. అనంతరం గాజు పెంకులు మింగి ఆత్మహత్యకు యత్నించా మని, కడుపులో నొప్పిగా ఉందని జైలు అధికారు లకు చెప్పారు. దీంతో జైలు అధికారులు వారిని హుటాహుటిన సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రే తీసేందుకు వచ్చిన అక్కడి వైద్యసిబ్బందిని తిడుతూ.. వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు.
దీంతో జైలు అధికారులు, పోలీసుల సాయంతో ఆ ఖైదీలను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో మరింత రెచ్చిపోయిన ఆ ఖైదీలు.. పోలీసులను, వైద్యులను దూషిస్తూ వైద్యం చేయించుకోకుండా గట్టిగా కేకలు వేస్తూ వార్డులోని ఓ మంచాన్ని కూడా విరగొట్టారు. విరిగిన మంచంలోని ఓ ముక్కతో కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆపై, ఆ గాజు పెంకులతో ఒళ్లంతా గాట్లు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా గాజు పెంకు లను నోట్లో పెట్టుకుని.. ఎవరైనా దగ్గరికొస్తే ఆ ముక్కలను మింగేస్తామంటూ వైద్య సిబ్బంది, పోలీ సులను బెదిరించారు. దీంతో ఎంతో కష్టపడి వారికి ట్రట్మెంట్ చేయించారు పోలీసులు.
కానీ, వైద్యులు ఇంజెక్షన్ చేసేట ప్పుడు కూడా అటూ ఇటు ఊగి పోతూ ఎగురుతూ నర్సులపై తిరగ బడుతూ నానా రభస చేశారు. దీంతో వీరి మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించాలని ఉస్మా నియా వైద్యులు సూచించారు. దీంతో జైలు అధికారులు, పోలీ సులు ఆ ఖైదీలను ఎర్రగడ్డ ఆస్ప త్రికి తరలించారు. పరీక్షలు చేసిన అక్కడి వైద్యులు ఖైదీల మానసిక స్థితి బాగానే ఉందని, కావాలనే విపరీతంగా ప్రవర్తి ున్నారని నిర్ధారించారు. దాంతో ఖైదీలను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఎలాగోలా వారికి ఎక్స్రేలు తీశారు. దాంతో ఆ ఖైదీలు గోడ గడి యారం బ్యాటరీ, పెన్నుమూత మింగారని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. మందులు ఇవ్వ డంతో బ్యాటరీ, పెన్నుమూత బయటపడ్డాయి. అనంతరం ఆ ఖైదీలను డిశ్చార్జి చేయడంతో అటు పోలీసులు, ఇటు జైలు అధికారులు ఊపిరి పీల్చుకు న్నారు. Give English URL, SEO Meta Title, SEO Meta Description, SEO Meta Keywords in English
