తిరుమలగిరిలో నేరస్తుడిపై దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్థుడు హత్యకు గురికావడం కలకలం రేపింది. బాలాజీ నగర్ కు చెందిన కిరణ్ 23 గతంలో పలు కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. తిరుమలగిరి గన్ రాక్ వద్దనున్న స్క్రాప్ దుకాణంలో అర్థరాత్రి ఒంటిగంట సమయం లో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కిరణ్ అనే యువకుడిని కర్రలతో దాడి చేసి పారిపోయారు నిందితులు. స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న పోలీస్ లు .గాయాల పాలయిన కిరణ్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్క్రాప్ దుకాణం నిర్వాహకుడు శేహన్ష సింగ్ ను అదుపులో తీసుకున్నారు పోలీస్ లు. మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. నిందితులు అంతా బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులుగా గుర్తించారు.
చిలకలూరిపేటలో ప్రమాదం.. ఇనుపచువ్వలు దిగి ఒకరి మృతి
చిలకలూరిపేటలో రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇనుప చువ్వలు దిగబడి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బాపట్ల జిల్లా యుద్దనపూడి మం. పూనూరుకు చెందిన అచ్చి ఏడుకొండలు (38) బేల్దార్ మేస్త్రిగా పని చేస్తున్నాడు. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనికి ఒప్పందం కుదుర్చుకోగా సామాగ్రి తెచ్చేందుకు సోమవారం చిలకలూరిపేట వచ్చాడు. ఇనుప చువ్వలు కొని వ్యానులో వేసి మణిప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై వ్యాన్ వెనకాల వస్తుండగా ఒక్కసారిగా వ్యాను నెమ్మదించింది. దీంతో ఏడుకొండలు శరీరంలోకి ఇనుప చువ్వలు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
లారీ ప్రమాదం…. క్యాబిన్ లో డ్రైవర్
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కొంపల్లి GVK EMRI ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు లో దూసుకెళ్ళింది TS 07 UL 4356 అనే లారీ టిప్పర్. ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ ప్రమాదం కారణంగా లారీ టిప్పర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు డ్రైవర్. సకాలంలో స్పందించి డ్రైవర్ ను కాపాడారు పోలీసులు.డ్రైవర్ సూర్య కాంత్ కు కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. స్దానికుల సమాచారంతో సంఘటన స్ధలానికి చేరుకొని క్యాబిన్ లో ఇరుకున్న డ్రైవర్ ను రక్షించి ఆసుపత్రి కి తరలించారు పేట్ బషీరాబాద్ పోలీసులు.
Read Also: Prabhas: అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్ ధరించిన షర్ట్ ధర ఎంతో తెలుసా?