Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ నుంచి గోవాకు వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 3.30 గంటలకు బారాబంకిలోని మహుంగుపూర్ సమీపంలో డబుల్ డెక్కర్ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నేపాలీ వలస కూలీలతో డబల్ డెక్కర్ బస్సు గోవాకు వెళ్తుండగా టైర్ ఒకటి పంక్చర్ అయింది. అనంతరం బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా మధ్యలో వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికుల్లో నలుగురు మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం బారాబంకి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు, అక్కడి వైద్యులు ఆరుగురిని లక్నో ట్రామా సెంటర్‌కు పంపినట్లు బారాబంకి సీనియర్ పోలీసు అధికారి పూర్ణేందు సింగ్ తెలిపారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని… వారిని తిరిగి నేపాల్‌కు పంపే ప్రక్రియ చేపడుతున్నామన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ నేపాల్ నుంచి గోవాకు పని నిమిత్తం వెళ్తున్న కూలీలని ఆయన వెల్లడించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని, ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు.
Rs 1000-crore compensation: సీరం, బిల్‌గేట్స్‌పై రూ.1000 కోట్ల దావా.. ఎందుకంటే..?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, 2021లో అత్యధికంగా 24,711 మరణాలతో ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. 2021లో దేశంలో జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.