NTV Telugu Site icon

Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..

Accident

Accident

Narsingi Crime: నార్సింగ్ మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్ కార్ అత్యంత వేగంగా ప్రయాణించి టిప్పర్ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో థార్ లో ప్రయాణిస్తున్న ముగ్గరు ఇంజనీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుండి నార్సింగ్ మై హోమ్ అవతార్ వద్ద టిప్పర్ (TS 31 TA 6776) లారీ డ్రైవర్ సతీష్ వెళుతున్నాడు. అయితే అదే రూట్ లో థార్ కారు (TS 09 EQ 1512) ముగ్గురు ఇంజనీర్లు సిరి, గౌతమ్, సుదీప్ ప్రయాణిస్తున్నారు. థార్ ఓవర్ స్పీడ్ తో అక్కడే వున్న లారీని బలంగా ఢీకొట్టింది. లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటన తెల్లవారుజాము 4:30 గంటలకు జరిగింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు.

Read also: Tollywood: మురారిని వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. 3వ స్థానంలో మురారి..

కారులో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డ వారిని పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించారా లేదా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మై హోమ్ అవుతార్ జంక్షన్ వద్ద సిగ్నల్స్ లేవని అందుకే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు నిర్లక్ష్యం వలన రాష్ డ్రైవింగ్ తోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి మై హోమ్ అవుతార్ జంక్షన్ వద్ద సిగ్నల్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒక వేళ మై హోమ్ అవుతార్ జంక్షన్ వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు ఇంకా చోటుచేసుకుంటాయని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు, పోలీసులు, ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Monarch Tractor: హైద‌రాబాద్‌లో మోనార్క్ ట్రాక్ట‌ర్స్ విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌..

Show comments