Site icon NTV Telugu

మంత్రి గంగుల కమలాకర్‌కి ఊరట

మంత్రి గంగుల కమలాకర్ కి ప్రుఆప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదైన కేసు కొట్టివేసింది కోర్టు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ పై కేసు నమోదైంది. కరీంనగర్ 3వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన ఈ కేసును శుక్రవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.

పోలీస్ స్టేషన్ పరిధిలోని హుస్సేని పుర పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారని, ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీశారని పోలీసులు కేసు పెట్టారు. అక్కడ గలాటాకు కారణమై స్థానికులకు ఇబ్బంది కలుగ చేశారని కేసునెంబర్ 66/2020 ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేనందున మంత్రి గంగుల కమలాకర్‌ పై కేసును శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.

Exit mobile version