Site icon NTV Telugu

Shocking Murder: ఇన్సూరెన్స్ పైసల కోసం.. మరీ ఇంతకు తెగిస్తారా..

Untitled Design (10)

Untitled Design (10)

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కేవలం ఇన్సూరెన్స్ పైసల కోసం వ్యక్తిని హత్యచేసారు. అనంతరం ముక్కలుగా కోసి చెరువులో పడేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మూడున్నర నెలల తరువాత మృతదేహం ముక్కలుగా దొరకడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also:Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే..

ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మూడున్నర నెలల తరువాత మృతదేహం గుర్తింపుతో సంచలన వ్యవహారం వెలుగు చూసింది. హైకోర్టు, హ్యూమన్‌ రైట్స్‌ చొరవతో కేసు కొలిక్కి వచ్చింది. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మృతదేహం ముక్కలు లభించగా.. మృతదేహం కోసం చెరువులో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపంతో.. ఇన్సూరెన్స్‌ డబ్బులో వాటా ఇవ్వలేదని పుదుపేటకు చెందిన గుణశీలన్ (65) అనే వృద్ధుడిని.. అయ్యప్పన్‌, గంగాధరం కలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు .

Read Also:Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…

నగరి మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేటకు చెందిన పీవీ గుణశీలన్‌ కు నలుగురు సంతానం.. చిన్న కొడుకు విజయ్‌ చెన్నైలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పుదుపేటలోనే ఉంటున్న గంగాధరం కూతురు కౌసల్యతో విజయ్ కు పెళ్లి కాగా కుటుంబ తగాదాలతో ఆరు నెలలకే విజయ్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే అతడి పేరు మీద ఇన్సూరెన్స్‌ డబ్బు రూ.1.25 కోట్ల దాకా వచ్చింది. ఈ నగదు గుణశీలన్, కళావతి అకౌంట్ లోకి వెళ్లింది.

అయితే అల్లుడు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్‌ డబ్బులో తమ కూతురుకు కూడా వాటా ఇవ్వాలని వియ్యంకుడైన గంగాధరం గొడవపడేవాడు. ఈ దశలో నగరిలో విడిగా ఉండలేక గుణశీలన్‌ ఆయన భార్య కళావతి తిరుత్తణిలో ఉన్న కూతురు సంగీత వద్దే ఉండిపోయారు. పద్మావతినగర్‌లో ఆమె నిర్మించే ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. పుదుపేటలో ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంటిని గుణశీలన్‌ తనకు పరిచయం ఉన్న అయ్యప్పన్‌కు అద్దెకు ఇచ్చాడు. గుణశీలన్‌ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్‌ వడ్డీకి కొంత డబ్బు ఇస్తే వ్యాపారం చేసి నెలనెలా ఇస్తానని రూ.28 లక్షలు దాకా అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుల్లో రూ.3.60 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన డబ్బులకు సమాధానం చెప్పకుండా ఉండటంతో.. డబ్బులు తిరిగి చెల్లించాలని గుణశీలన్‌ గట్టిగా నిలదీశాడు.

Read Also:Andhra Pradesh: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి కొత్త నిబంధనలు..

ప్రతిరోజు ఉదయం కూతురు ఇంటి నిర్మాణ పనులను చూసుకునేందుకు క్యారియర్ తో వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చే గుణశీలన్‌ 2025 జూన్‌ 6వ తేదీ వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. నాలుగు రోజులపాటు రాకపోవడం, ఫోన్‌ పనిచేయకపోవడంతో కూతురు సంగీత తిరుత్తణి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయ్యప్పన్ ని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

Read Also:Jubilee Hills By Poll : భారీ స్థాయిలో నామినేషన్లు.. ఇప్పటి వరకు ఎన్నంటే..?

ఇన్సూరెన్స్ డబ్బుల్లో తన కూతురుకు వాటా ఇవ్వలేదని కసితో ఉన్న గంగాధరం కలిసి హత్యకు ప్లాన్ చేశారు. అప్పుల విషయం మాట్లాడుకుందామని అయ్యప్పన్ నగరిలోని ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం అయ్యప్పన్‌ గుణశీలన్‌ను తల వెనుకవైపు బలమైన కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల, మొండెం, కాళ్లు , చేతులు అన్ని నరికి గోనె సంచిలో కట్టి నదిలో పడేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Exit mobile version