NTV Telugu Site icon

Rayadurgam Car Accident: రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. కారులో ఇరుక్కుని విద్యార్థి మృతి..

Rayadurgam Car Accident

Rayadurgam Car Accident

Rayadurgam Car Accident: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్ (19)గా పోలీసులు గుర్తించారు. అతివేగంతో కంట్రోల్ తప్పి డివైడర్ కు షిఫ్ట్ డిజైర్ కారు గుద్దుకుంది. దీంతో అక్కడ పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరుగున వచ్చి చూడగా అప్పటికే చరణ్ కారులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

Read also: Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న క‌మెడియ‌న్ హ‌ర్ష.. అసలు నిజం ఇదే..

చరణ్ వయస్సు 19 సంవత్సరాలు కావడం కారు ఓవర్ స్పీడ్ తో నడిపినందుకు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహిదీపట్నంలోని తన ఇంటికి చరణ్ వెళ్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు ఫ్లైఓవర్ ఫిల్లర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతికష్టమ్మీద బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో కారులో చరణ్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Paris Olympic 2024 : నేడు మరోసారి బరిలో మను భాకర్.. మూడో పతకం సాధించేనా?