Girl Death Mystery: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4వ తేదీన జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు. రంజిత వాళ్ళు ఉంటున్న ఇంటి కింద ఫ్లోర్ లో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానల్లో పని చేస్తున్న కోటి స్నేహితుడు శ్రీను.. రెగ్యులరుగా స్నేహితుడు కోటి షాప్ దగ్గరికి శ్రీను వస్తూ ఉండేవాడు.. తాను ఇంట్లో లేని సమయంలో చిన్నారికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చి ఇమ్మని శ్రీనుకి చిన్నారి రంజిత తల్లి సునీత చెప్పేది.. రంజిత హత్య జరిగిన రోజు పై ఫ్లోరులో ఉంటున్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్లిన శ్రీను.. రంజిత తల్లి సునీతతో ఫోన్ లో శ్రీను చాలా సేపు మాట్లాడుకునే వారని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Bengaluru: ఇది జైలా గెస్ట్ హౌస్ హా..? ఉగ్రవాది, సీరియల్ కిల్లర్‌కు మొబైల్, టీవీ, ‘VIP’ సౌకర్యం..!
అయితే, ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికి వచ్చి చున్నీ మెడకు బిగించి రంజితను శ్రీను చంపినట్లు పోలీసులు గుర్తించారు. తనపై అనుమానం రాకుండా విచారణకి వచ్చిన పోలీసులతో అతడు తిరిగినట్లు సమాచారం. అలాగే, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని మెసేజ్జులు కూడా శ్రీను పెట్టిన చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
