Site icon NTV Telugu

Shocking Incident: రాజస్థాన్ లో దారుణం.. ప్రయాణికుడిపై కండక్టర్ దాడి..

Untitled Design (5)

Untitled Design (5)

టికెట్ రేటు పోగా మిగిలిన డబ్బు ఇవ్వాలని అడిగినందుకు ఓ ప్రయాణికుడిపై కండక్టర్ దాడి చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరత్‌పూర్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ప్రయాణికుడు భరత్‌పూర్ నుంచి ఆగ్రాకు వెళ్తున్నాడు. అయితే అతడు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కండక్టర్‌కు 500రూపాయలు ఇచ్చాడు. అయితే టికెట్ ధర 64రూపాయలు మాత్రమే కావడంతో మిగిలిన డబ్బు ఇవ్వాలని ప్రయాణికుడు కండక్టర్‌ను కోరాడు. అయితే..ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కండక్టర్ విచక్షణారహితంగా ప్రయాణికుడిపై దాడి చేశాడు. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు గొడవను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాకుండా డ్రైవర్ కూడా ఈ ఘటనను ప్రోత్సహించినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మిగిలిన డబ్బులు అడిగితే కొట్టడం ఏంటని కండక్టర్ పైనా, రాజస్థాన్ ఆర్టీసీపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Exit mobile version