రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. నవజాత శిశువును రాళ్లతో కప్పి.. నోట్లో ఫెవికిక్ వేసి చంపేందుకు యత్నించింది ఓ కుటుంబం.. స్థానికులు గమనించి నిందితులను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం శిశువు ఐసీయూలో చికిత్స పొందుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… భిల్వారాలోని బిజోలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సీతా కుండ్ మహాదేవ్ అడవిలో రాళ్ల కింద పూడ్చిపెట్టిన నవజాత శిశువును ఫెవిక్విక్ నోటిలో రాయి పెట్టి బంధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం, అడవిలో రాళ్ల కింద పాతిపెట్టబడిన నవజాత శిశువును గ్రామస్తులు కనుగొన్నారు. ఆ చిన్నారి నోటిలో రాళ్లను దింపి, ఏ కేకలు బయటకు రాకుండా ఫెవిక్విక్‌తో మూసివేశారు. గ్రామస్తుల సకాలంలో రావడంతో.. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడగలిగారు..
నిందితురాలు కొంతకాలంగా బుండి జిల్లాలోని బసోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు.. నవజాత శిశువు అక్రమ సంబంధం ఫలితంగా పుట్టిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ యువతికి తన మేనమామ కొడుకుతో సంబంధం పెట్టుకుని గర్భవతి అయ్యింది. ఐదు నెలల తర్వాత విషయం బయట పడడంతో..ఆమె తల్లిదండ్రులు ఇంటిని వదిలేసి బుండి జిల్లాలో కూలీలుగా పని చేయడం మొదలు పెట్టారు. గర్భాన్ని తొలగించే ప్రయత్నాలు విఫలం కావడం.. బిడ్డ పుట్టడంతో అవమానంగా భావించారు. 19 రోజుల తర్వాత బిడ్డను అడవిలోకి తీసుకెళ్లి .. నోటిలో ఫెవిక్విక్ వేసి రాళ్లలో కప్పేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులంతా బిడ్డను కాపాడారు. ప్రస్తుతం శిశువు ఐసీయూలో చికిత్స పొందుతుంది.
అనంతరంపోలీసులు ఆ యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కేసును నిర్ధారించడానికి DNA పరీక్షకు సన్నాహాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. సంఘటన యొక్క అన్ని వివరాలు త్వరలో అధికారికంగా బహిర్గతం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
