Site icon NTV Telugu

Raipur: ఎక్కడా..ప్లేస్ దొరకలేదా.. కారులో శృంగారం చేస్తూ దొరికిన ప్రవచనకర్త

Untitled Design

Untitled Design

రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి కనిపించడంలేదు. అయితే ఓ వ్యక్తి ఓ వివాహితతో అక్రమం సంబంధం పెట్టుకుని ఏకంగా కారులో శృంగారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయమేమిటంటే.. అతడో అధ్యాత్మిక ప్రచార కర్త.

Read Also: రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిన ఇన్‌స్పెక్టర్

పూర్తివివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని రేవాలో అధ్యాత్మిక ప్రచారకుడిగా గుర్తింపు పొందిన భాస్కరాచార్య .. చత్తీస్ గఢ్ రాయ్ పూర్ ఒక వివాహితతో కారులో శృంగారం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో వివాహిత భర్త అనిల్ గుప్తాకు వీరిపై అనుమానం వచ్చి.. ఇద్దరిని పట్టుకోవాలని ప్లాన్ చేశాడు. కారులో తన స్నేహితురాలితో లైంగిక సంబంధం పెట్టుకుంటూ అతను పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

Read Also:Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ

వివాహిత మహిళ రీనా గుప్తాతో కారులో సన్నిహితంగా ఉండగా.. ఆమె భర్త అనిల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. స్థానికులతో కలిసి ప్రవచనకర్తపై దాడి చేశాడు. జుట్టు కత్తిరించాడు. ఈ క్రమంలో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన మహిళను.. అతనితోనే వెళ్లమని సూచించాడు భర్త. పద్దెనిమిదేళ్ల బంధానికి విలువ లేదని బాధపడిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిచారు. స్థానికులు అతన్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. వాస్తవానికి, రాయ్‌పూర్ నివాసి అనిల్ గుప్తాకు భాస్కరాచార్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళకు 18 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆమె భాస్కరాచార్యతో సంబంధాన్ని కొనసాగించింది. ఓ ప్రచార కర్త ఇలా చేయడంతో తీవ్ర స్థాయలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Exit mobile version