Site icon NTV Telugu

High-Tension Wire :రైల్వే హైటెన్షన్‌ వైర్‌కు తగిలిన యువకుడు.. షాక్ లో ప్రయాణీకులు

Viral (1)

Viral (1)

రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు ఆగి ఉన్న రైలు ఎక్కాడు.. అనంతరం హైటెన్షన్‌ వైర్ కు తగిలి అక్కడికిక్కడే చనిపోయాడు. ఇది చూసిన ప్రయాణీకులంతా.. భయాందోళనకు గురయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్‌కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఈ ఘటన చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నాగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లోని ఆగి ఉన్న ట్రైన్‌ కోచ్‌పైకి ఒక వ్యక్తి ఎక్కి నిలబడ్డాడు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు.. అతడిని కిందికి దిగాలని కోరారు. అయినప్పటికి వారి మాటలు పట్టించుకోకుండా అక్కడే నిలబడ్డాడు. అనుకోకుండా విద్యుత్ వైర్లు తగలడంతో.. షాక్ కొట్టి… బోగి మీద నుంచి కింద పడి చనిపోయాడు.

ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version