Crime: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. ఓ వైపు దేశవ్యాప్తంగా కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, పంజాబ్‌కి చెందిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. డెహ్రాడూన్‌లో మంగళవారం సాయంత్రం పబ్లిక్ బస్సులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆమె మొరాదాబాద్ నుంచి వస్తుండగా మంగళవారం డెహ్రాడూన్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్(ISBT) వద్ద ఘటన జరిగింది.
Read Also: Ankith Koyya: ‘నేను అల్లు ఫ్యామిలీలో పుట్టా, అల్లు అర్జున్ మా అన్నయ్య’.. హీరో అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఉత్తరాఖండ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోంది. ఈ కేసులో డ్రైవర్‌తో పాటు కండక్టర్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం ఐదుగురుని అరెస్ట్ చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాధితురాలని సంక్షేమ కేంద్రానికి పంపినట్లు ఒక అధికారి తెలిపారు.
కోల్‌కతాలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్త ఆందోళనల మధ్య డెహ్రాడూన్ సంఘటన జరిగింది. ఆగస్టు 09న కోల్‌కతా వైద్య కళాశాలలో వైద్యురాలు శవమై కనిపించింది. నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై కాలేజీ సెమినార్ హాలులోనే అత్యాచారం జరిగింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోంది.