NTV Telugu Site icon

Woman Mystery Case: వీడిన వివాహిత హత్య కేసు మిస్టరీ.. అతడే కాలయముడు

Husband Wife Crime

Husband Wife Crime

Police Chases Woman Mystery Case In Chittoor: చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తే కిరాతకరంగా చంపాడని తేల్చారు. బంగారు నగల విషయంలో నెలకొన్న విభేదాలే అందుకు కారణమని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మల్లేరు గ్రామానికి చెందిన యాదగిరికి 2019లో అదే గ్రామానికి చెందిన రోజాతో వివాహమైంది. పెళ్లి సమయంలోనే రోజాకు పుట్టింటివారు బంగారు నగలను కానుకగా ఇచ్చారు. అయితే.. వాటిని తన భార్యకు తెలియకుండా యాదగిరి అమ్మేశాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం రోజాకి తెలిసింది. అప్పట్నుంచి రోజా తన నగలను తెచ్చివ్వాలంటూ భర్తతో గొడవపడటం మొదలుపెట్టింది.

కేవలం నగల కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావంటూ.. భర్తతో పాటు అత్తింటివారు కూడా ఆమెని వేధించడం ప్రారంభించారు. రానురాను వారి వేధింపులు మరింత పెరిగిపోవడంతో.. భర్తతో కలిసి పక్కనే ఉన్న ఇంట్లోకి రోజాకు మకాం మార్చింది. ఇల్లు మారినా.. నగల గొడవ మాత్రం ఆగలేదు. డబ్బులు పోగయ్యాక తాను నగలు తీసిస్తానని భర్త చెప్పినా.. ఇప్పుడే కావాలంటూ రోజా పట్టుపడేది. ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన యాదగిరి.. ఒక పెద్ద కట్టర్ తీసుకొచ్చి, రోజా గొంతుపై బలంగా నరికాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్యను చంపాక అతడు భయపడిపోయాడు. ఏం చేయాలో పాలుపోక కాసేపు ఆలోచించిన అతగాడు.. ఈ హత్య కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఒక కట్టుకథ అల్లేశాడు.

తొలుత భార్య మెడలో ఉన్న తాళిబొట్టు, చెవిపోగుల్ని కోళ్లషెడ్డులో దాచాడు. అనంతరం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి.. తన భార్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని, ఆమె శరీరంపై ఉన్న నగలు దోచుకెళ్లారని కథ అల్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. భర్తపై అనుమానం రావడంతో.. ఆ కోణంలో విచారణ చేశారు. చివరికి.. భర్తే రోజాను చంపాడని తేల్చారు. భర్తతో పాటు అత్తమామలను కూడా అరెస్ట్ చేశారు.

Show comments