Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..
- ఇంద్రేశంలో భార్యాభర్త హత్య..
- క్లూస్ టీమ్‌తో పలు ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..
- దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల, ధరావత్ మంగమ్మగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఇద్దరు దంపతుల హత్య కలకలం రేపింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాచ్‌మన్ దంపతులను అత్యంత దారుణంగా హత్యచేశారు. దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఇద్దరి ప్రాణాల్ని కబలించటం పలు అనుమానాలకు తావిస్తోంది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో భార్యాభర్తలను హత్య చేయడం సంచలనం సృష్టించింది. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో పలు ఆధారాలు సేకరించారు. మృతులిద్దరిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల, ధరావత్ మంగమ్మగా గుర్తించారు.
Also Read
- Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
Also Read:Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ఇంద్రేశం.. ధరావత్ సోముల గత మూడున్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అనే బిల్డర్ దగ్గర వాచ్‌మెన్‌గా పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లయింది. చిన్న కూతురు సానియా పదవ తరగతి చదువుతోంది. ఇటీవలే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ఇంద్రేశం.. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు దొంగతనాలకు అడ్డాగా మారుతున్న ఇంద్రేశంలో వాచ్‌మెన్ దంపతుల హత్య సంచలనంగా మారింది.
వాచ్‌మెన్ దంపతులను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీకి గురి కాకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో అసలు హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వాచ్‌మెన్ దంపతులకు ఏవైనా పాత కక్షలు ఉన్నాయా? భూమి తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదా చోరీకి వచ్చిన వారు ఎక్కడ దంపతులు తమను గుర్తుపడతారో అని హత్య చేశారా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!