Site icon NTV Telugu

Fire In Flight: పవర్‌ బ్యాంక్‌ పేలి విమానంలో మంటలు..ఎక్కడంటే..

Indigo Flight

Indigo Flight

గత కొద్ది రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు.

Read Also:smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా..

పూర్తి వివరాల్లోకి వెళితే.. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు చెలరేగిన ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు బయల్దేరేందుకు ఇండిగోకు చెందిన 6 ఈ 2107 విమానం రెడీ అయ్యింది. ఈ క్రమంలో విమానం రన్‌వేపైకి వెళ్తుంది. ఇంతలో ఒక ప్రయాణికుడి చెందిన పవన్‌ బ్యాంక్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అది గమనించిన క్యాబిన్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పివేశారు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Read Also:Jewel Heist: నాలుగు నిమిషాల్లోనే.. నెపోలియన్ కాలం నాటి ఆభరణాలు చోరీ..

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత దీనిపై ఇండిగో విమానయాన సంస్థ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై కొన్ని క్షణాల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని వెల్లడించింది. ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

Exit mobile version