Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..
- దాహం వేస్తుందంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు..
- అత్యంత పాశవికంగా లైంగిక దాడి..
- అనారోగ్యంతో ఉన్నానన్నా కనికరించని వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఒక మహిళపై గుర్తు తెలియని దుండగుడు పాశవికంగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.
ఏం జరిగిందంటే..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఏప్రిల్ 2వ తేదీ గురువారం సాయంత్రం, మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ల మహిళ తన నివాసంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ‘దాహంగా ఉంది.. మంచినీళ్లు కావాలి’ అని ఆమెను నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. తాను అనారోగ్యంతో (హెచ్ఐవీ) ఉన్నానని మొరపెట్టుకున్నా ఆ కిరాతకుడు కనికరించలేదు. బాధితురాలిని స్కార్ఫ్‌తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెను తీవ్రంగా కొట్టి, మర్మాంగాల్లోకి ఇనుప రాడ్‌ను చొప్పించి అత్యంత క్రూరంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read:Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..
వెలుగులోకి వచ్చిందిలా..
బాధితురాలితో కలిసి నివసిస్తున్న ఆమె మేనల్లుడు పదో తరగతి పరీక్షల అనంతరం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం అత్తకు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పంపాడు. వారు వెళ్లి చూడగా, ఆమె రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశులయ్యారు. వెంటనే ఆమెను మాచర్ల నుంచి నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై మాచర్ల టౌన్ సీఐ వెంకట రమణ నేతృత్వంలో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!