NTV Telugu Site icon

Pakkalapati Chandrasekhar: న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్.. అడ్డంగా బుక్కైన మేనేజర్

Video Calls

Video Calls

Pakkalapati Chandrasekhar Arrested For Harrasing Women With Nude Calls: కామాంధుల్లో ఈ కామాంధుడు వేరు. ఇతడు తన కామవాంఛ తీర్చుకోవడం కోసం.. మహిళల్ని తన మాయమాటలతో వలలో పడేస్తాడు. వారితో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న తర్వాత.. న్యూడ్ కాల్స్ చేయమంటూ ఒత్తిడి చేస్తాడు. నమ్మిన వ్యక్తే కదా అని, మహిళలు అతడు చెప్పినట్టు న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు. అక్కడే వాళ్లు అతనికి దొరికిపోయేవారు. ఆ వీడియో కాల్స్‌ని అతడు రికార్డ్ చేసి, వారిని బెదిరించాడు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేశాడు. ఇలాగే ఓ మహిళను వేధింపులకు గురి చేయగా.. ఆమెను పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. ఆ కామాంధుడి కిరాతకాలకు ఫుల్‌స్టాప్ పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Chiranjeevi: పెంచు.. పెంచు.. హైప్ పెంచు.. చచ్చిపోవాలా జనాలు

హెర్బా లైఫ్ కంపెనీలో వక్కలపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన వద్దకు వచ్చే మహిళల ఫోన్ నంబర్లను సేకరించి, వారికి మెసేజ్‌లు చేసి, చనువు పెంచుకునేవాడు. తన వలలో చిక్కుకున్న వారి మహిళల నుంచి వ్యక్తిగత వివరాలు సేకరించి, వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకే పాల్పడేవాడు. అతడి దుర్బుద్ధిని పసిగట్టి.. కొందరు చాకచక్యంగా తప్పుకున్నారు. కానీ.. మరికొందరు మాత్రం, అతని బుట్టలో పడేవారు. అలా తన బుట్టలో పడిన వారిని నమ్మించి, న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేవాడు. ఆ వీడియో కాల్స్‌ని రికార్డ్ చేసేవాడు. ఇలా రికార్డ్ చేసి, ఎందరో మహిళల్ని బ్లాక్‌మెయిల్ చేసి, భారీ డబ్బు కాజేశాడు. పాపం.. తమ పరువు పోతుందన్న భయంతో, అతడు అడిగినంత డబ్బులను కొందరు ఇచ్చారు.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన 10 నగరాలు

ఇలాగే.. కేపీహెచ్‌బీకి చెందిన ఒక మహిళను సైతం చంద్రశేఖర్ వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేక.. ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు. అతని గురించి విచారించగా.. మరో షాకింగ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో ఇలాగే రాయదుర్గం పరిధిలోని ఒక మహిళను బ్లాక్‌మెయిల్ చేసి, ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. ఆమెపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. దీంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అతడు మారలేదు. మళ్లీ అదే దురాగతలాకు పాల్పడి, మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు.