ప్రస్తుత్రం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు తమకు వచ్చిన టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు టిక్ టాక్ వచ్చి ఎంతోమందిని చెడగొట్టింది. అది బ్యాన్ చేయడంతో ప్రస్తుతం అందరు యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ అంటూ చెత్త చేత వీడియోలను పెడుతూ లైక్స్ కోసం ఎగబడుతున్నారు. తాజగా ఒక మహిళ యూట్యూబ్ వీడియోల మోజులో పడి జైలుపాలైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సుగంధి టిక్ టాక్ లు చేస్తూ సెలబ్రిటీ అవ్వాలని కలలు కనేది. అప్పడికే ఆమెకు వివాహమై ఒక పాప ఉంది. అయినా భర్త పిల్లలను పట్టించుకోకుండా నిత్యం టిక్ టాక్ లు చేస్తూ ఉండేది. దీంతో విసుగు చెందిన భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. అనంతరం పాపతో కలిసి ఉంటున్న సుగంధి లో మార్పు రాలేదు. తన స్నేహితురాలు దివ్యతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు తీయడం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి దుర్భాషలాడుకుంటూ, అసభ్యంగా మాట్లాడుకునేవారు. ఇక వీటితో పాటు సుగంధి బూతు వీడియోలను పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. పురుషులను రెచ్చగొట్టేలా అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతూ ఉండే ఆమెపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక మహిళ సుగంధి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకొని సుగంధిని అరెస్ట్ చేశారు.
