Nellore : మాట్లాడాలి రూమ్‌కి రమ్మన్నాడు.. త్వరగా వెళ్లొచ్చులే అని నమ్మించాడు.. నమ్మి వెళ్లిన ఆ అమ్మాయిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. మీ అక్కని తీసుకెళ్లమంటూ ఆమె చెల్లికి ఫోన్ చేశాడు.. తానే కత్తితో పొడుచుకుని చనిపోయిందని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నెల్లూరులో జరిగిన మైథిలి ప్రియా హత్యలో ప్రేమోన్మాది చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మైథిలి. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుబర్తి స్వస్థలం. ఆమెకు 3 నెలల క్రితమే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ ఈ లోగానే ఇదిగో ఇలా మృతి చెందింది..
బెంగుళూరు వెళ్లి జాబ్‌లో చేరిన తర్వాత సెప్టెంబర్ 6న పుట్టినరోజు కావడంతో ఈ నెల 3న నెల్లూరులోని చెల్లి రూమ్‌కి వచ్చింది. తోటి స్నేహితుడు నిఖిల్ పిలవడంతో అతన్ని కలిసేందుకు రూమ్‌కి వెళ్లింది మైథిలి. వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. దారుణంగా హత్యకు గురైంది. నిఖిల్ రూమ్ మెట్ల మీద మైథిలి మృతదేహం కనిపించింది. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కల్గించింది… నిఖిల్‌కు నర్సింగ్ కాలేజ్‌లో మైథిలి క్లాస్‌మేట్ నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో మైథిలి ప్రియాను ఆమెతో సన్నిహితంగా ఉంటున్న నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. రాపూర్ మండలం చుట్టుపాలానికి చెందిన నిఖిల్‌కు నర్సింగ్ కాలేజ్‌లో మైథిలి క్లాస్‌మేట్. బీ ఫార్మసీ పూర్తి చేసిన ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. నిఖిల్‌కి బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. వీరిద్దరూ కరెంట్ ఆఫీస్ సెంటర్లో రూమ్స్ తీసుకొని చదువుకున్నారు…
బెంగుళూరు నుంచి రాగానే మైథిలి స్నేహితులను కలిసింది. జాబ్ బాగుందని చెప్పింది. రాత్రి 11 సమయంలో ఆమె చెల్లి సాహితి ఫోన్ చేయగా.. ఫ్రెండ్స్‌తో ఉన్నానని చెప్పింది. త్వరగానే వచ్చేస్తానని చెప్పింది. సుమారు 3 గంటల సమయంలో నిఖిల్ ఫోన్ నుంచి మైథిలి చెల్లెలు సాహితీకి ఫోన్ వచ్చింది. మీ అక్క రూమ్ దగ్గర ఉంది తీసుకెళ్లమంటూ అతను చెప్పాడు. దీంతో భయపడ్డ సాహితి వెంటనే నిఖిల్ రూమ్ వద్దకు వెళ్లింది. మెట్ల మీద మైథిలి ప్రియా మృతదేహాన్ని సాహితీ గుర్తించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఇద్దరం గొడవ పడ్డాం మీ అక్కని చంపేశాను.. అని నిఖిల్ చెప్పినట్లు సాహితి తెలిపింది. మైథిలినే పొడుచుకుని చనిపోయిందని నిఖిల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు…
రాత్రి మాట్లాడాలని రూమ్‌కి పిలిచి రూమ్‌లోనే మైథిలిని హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో మైథిలిని నిఖిల్ ప్రేమించాడు. అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు దూరంగా ఉంటున్నారు. ప్రేమ విషయం తెలిసి నిఖిల్ కి కౌన్సిలింగ్ ఇచ్చామని.. దూరంగా ఉంటానని చెప్పి.. తన కూతుర్ని నిఖిల్ చంపేశాడని మృతురాలి తల్లి లక్ష్మి తెలిపింది. మైథిలి, నిఖిల్.. బీ ఫార్మసీ మొదటి సంవత్సరం నుంచే స్నేహితులు. ఐతే ఆమెకు జాబ్ రావడంతో బెంగళూరు వెళ్లిపోయింది. నిఖిల్ నెల్లూరులోనే ఉంటున్నాడు. అయితే మైథిలిని ఎందుకు చంపాడనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. తనను దూరం పెడుతుందనే కోపంలో చంపాడా? లేకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది పోలీసుల విచారణలో తెలాల్సి ఉంది….
