Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

Nikhitha

Nikhitha

అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అర్జున్ శర్మ(27) ను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ శర్మపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఆగ్రాలో శర్మ ఆచూకీ గుర్తించారు తెలంగాణ పోలీసులు. ఆగ్రాలోని అపార్ట్‌మెంట్‌లో దాక్కున్న అర్జున్ శర్మను పట్టుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.

ఆగస్టు 24న ఆగ్రాలో శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసుల బృందం.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిఖిత హత్య కేసులో శర్మపై అభియోగాలు.. మాజీ ప్రియురాలు నిఖితను హత్య చేసినట్లు అమెరికా పోలీసుల ఆరోపించారు. రూ.వేల డాలర్ల ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా? 2025 డిసెంబర్ 31న నిఖితను అపార్ట్‌మెంట్‌కు పిలిచిన శర్మ 4,000 డాలర్లు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచినట్లు ఆరోపణలు వచ్చాయి. నిఖిత హత్య అనంతరం ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌లోని సూట్‌కేసులో నిఖిత మృతదేహం గుర్తించిన అమెరికా పోలీసులు.

హత్య అనంతరం భారత్‌కు పరారైనట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడి. అర్జున్ శర్మపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ శర్మపై కేసు నమోదు. దర్యాప్తులో ఆగ్రాలో శర్మ ఆచూకీ గుర్తించిన తెలంగాణ పోలీసులు. స్థానిక పోలీసుల సహకారంతో ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో శర్మను హాజరుపరిచిన అధికారులు. అమెరికా అభ్యర్థన మేరకు అప్పగింత ప్రక్రియ ప్రారంభం.. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

శర్మపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్యతో పాటు దాడి అభియోగాలు, కేసును సీబీఐకి అప్పగించిన అధికారులు. అర్జున్ శర్మ అరెస్ట్‌పై నిఖిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అయితే కుమార్తె హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదంటున్న కుటుంబం.. నిఖిత మరణం వెనుక ఆర్థిక వివాదం ఉందని కుటుంబం ఆరోపణలు చేసింది. ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్.. భారత్, అమెరికా అధికారుల నుంచి మరింత పారదర్శకత కోరుతున్న నిఖిత కుటుంబ సభ్యులు.