Site icon NTV Telugu

చందానగర్ హత్యకేసులో వీడిన మిస్టరీ.. ప్రియుడే హంతకుడు

గత రెండు రోజులుగా చందానగర్ యువతి ఆత్మహత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నర్సు నాగచైతన్య హోటల్ రూమ్ లో రక్తపు మడుగులో పోలీసులకు కనిపించింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. రెండు రోజులు గాలించి ప్రియుడు కోటిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా.. నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. తానే తన ప్రియురాలిని హత్య చేసినట్లు కోటిరెడ్డి ఒప్పుకోవడం ఇంకా సంచలనంగా మారింది. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామానికి చెందిన నాగ చైతన్య(24) నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది. గుంటూరుకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటివ్ గా నాగ చైతన్య పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చేరాడు. అక్కడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.. కొద్దీ రోజులలోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో ఆరు నెలల నుంచి నాగ చైతన్య, కోటిరెడ్డిపై పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన కోటిరెడ్డి, ప్రియురాలిని చంపితే కానీ సమస్య తీరదనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ లో ఉంటున్న ప్రియురాలి దగ్గరకు వచ్చి ఈ నెల 22 న ఆమెను తీసుకొని లాడ్జిలో ఒక రూమ్ తీసుకున్నాడు.

స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ పెట్టి, మందు తాగి రాత్రంతా రచ్చ చేశాడు. 23 వ తేదీ అర్ధరాత్రి కోటిరెడ్డి రక్తపు మడుగులో ఒంగోలులో ఉన్న జీజీహెచ్ లో కనిపించాడు. ఏమైంది అని అడుగగా.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. ఇద్దరూ కలిసి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. కత్తి పోట్ల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు ఆ తర్వాత ఏమైందో తెలియని అన్నాడు. ఇటు పక్క రెండు రోజులు అవుతున్నా గది తలుపులు తెలవకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది తాళం పగలకొట్టి చూడగా రక్తపు మడుగులో నాగ చైతన్య కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కోటిరెడ్డిపై అనుమానంతో అతడిని తమదైన రీతిలో విచారించగా తానే గొంతుకోసి ప్రియురాలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నాగ చైతన్య ఒంటిపై కత్తి పోట్లు ఉన్నాయని, అది ఆత్మహత్యలా అనిపించలేదని తెలిపారు. అంతకుముందే కోటి రెడ్డి ఓ సూపర్‌ మార్కెట్‌లో కత్తి, తాడు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాత్రి ఇద్దరు మద్యం సేవించిన తర్వాత ఘర్షణ చోటుచేసుకుందని, ఆ ఘర్షణ లోనే కోటి రెడ్డి, నాగ చైతన్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version