ప్రస్తుత సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు. కామంతో రగిలిపోతున్న వారు వావివరుసలు మరిచిపోవడమే కాదు లింగ బేధాలను కూడా మారుస్తున్నారు. కామ వాంఛ తీర్చుకోవడానికి ఆడ అయితే ఏంటి ..? మగ అయితే ఏంటి అంటూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చెరుకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని మరో యువకుడు బలత్కారం చేసి, దాడి చేసిన ఘటన మరువకముందే స్నేహితుడు శృంగారానికి ఒప్పుకోలేదని తలపై రాడ్డుతో బాది హత్య చేసి, కామవాంఛ తీర్చుకున్నాడో రాక్షస స్నేహితుడు. ఈ దారుణ ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. అక్టోబర్ 22న కరవేలో ఆగి ఉన్న బస్సు వెనుక సీటులో రూప్ సింగ్(30) శవమై కనిపించాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆధారాలను బట్టి అతని స్నేహితుడు మస్కే ని పట్టుకొని విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అక్టోబర్ 21 అర్ధరాత్రి రూప్ సింగ్, మస్కే ఇద్దరు నవీముంబైలోని కరావే గ్రామానికి సమీపంలో ఉన్న సర్వీస్ రోడ్డులో ఆగిఉన్న బస్సులో కలిశారు. అప్పటికే మస్క్ మద్యం మత్తులో ఉండడంతో తనతో శృంగారం చేయమని రూప్ సింగ్ ని బలవంతం చేశాడు. ఇందుకు రూప్ సింగ్ ఒప్పుకోకపోవడంతో కోపంతో ఊగిపోయిన మస్కే పక్కనే ఉన్న రాడ్డుతో రూప్ సింగ్ తలపై బాది హత్య చేశాడు. అనంతరం అతడిపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్కేని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
