Site icon NTV Telugu

Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు

Untitled Design (7)

Untitled Design (7)

కాచిగూడ రైల్వే స్టేషన్ లో .. రైలు దిగుతూ.. కాలు జారి ఓ యువకుడు కిందపడిపోయాడు. బెంగుళూరు వెళ్లేందుకు కాచిగూడ స్టేషన్ చేరుకున్న అతడు రైలు దిగుతూ కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడారు. కొంచెం అటు ఇటు అయితే.. యువకుడి ప్రాణాలు పోయేవని అధికారులు వెల్లడించారు.

Read Also:BJP MLA: రీల్స్ చేస్తూ… కాలుజారి నదిలో పడిపోయిన ఎమ్మెల్యే…

పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు, రైలు వచ్చేసరికి.. అనుకోకుండా ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో ఎక్కేశాడు. కొద్ది సేపటికి రైలు కదులుతుండగా కిందకు దిగేశాడు. దీంతో అతడి కాలు జారి రైలు కింద పడిపోయేవాడు. అక్కడే విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవింద రావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత.. అతడిని పక్కకు లాగి కాపాడారు. ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే స్పందించిన రైల్వే ఉద్యోగులను స్థానికులు, రైల్వే అధికారులు అభినందించారు.

Read Also:Suspended: రెస్టారెంట్‌లో అన్నచెల్లెళ్లిని వేధించిన పోలీస్ అధికారి.. తర్వాత ఏమైందంటే..

ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎక్కే ముందు అన్ని వివరాలు చూసుకున్న తర్వాతనే సరైన ట్రైన్ ఎక్కాలని పాసింజర్లకు రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు సైతం జాగ్రత్తలు పాటించాలని వివరించారు.

Exit mobile version