Crime: పోలీసుగా నటిస్తూ మహిళల్ని మోసం చేస్తున్న వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్‌గా నటిస్తూ, నౌషద్ త్యాగి అనే వ్యక్తి తన పేరును రాహుల్ త్యాగిగా మార్చుకుని మహిళల్ని టార్గెట్ చేస్తున్నాడు. గత మూడేళ్లలో అనేక రాష్ట్రాల్లో మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. త్యాగి నకిలీ పోలీసు యూనిఫాం ధరించి మహిళల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కానిస్టేబుల్ అని నటించేవాడు.
Read Also: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
త్యాగి ముందుగా వితంతు మహిళలు, భర్తలకు దూరంగా ఉండే మహిళల్నే టార్గెట్ చేసేవాడు. త్యాగి వలలో 18 నుంచి 20 మంది మహిళలతో అతను సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వీరిలో 10 మందిని లైంగికగా వాడుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, ఘజియాబాద్, బులంద్‌షహర్, మధుర, సంభాల్, ముజఫర్‌నగర్,అస్సాం, మేఘాలయలలో కూడా మహిళల్ని మోసం చేశాడని తెలుస్తోంది.
10వ తరగతి మాత్రమే చదివిని త్యాగి ఫేక్ పోలీసుగా నటిస్తూ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో కొంతమంది నిజమైన పోలీసులతో కూడా పరిచయాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక మహిళ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళల గోప్యతను వెల్లడించకుండా కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
