NTV Telugu Site icon

Couple Suicide: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య.. ఆ తర్వాత భార్య కూడా..

Couple Suicide

Couple Suicide

Couple Suicide: కుటుంబ తగాదాలు భార్యభర్తల ఆత్మహత్యలకు కారణయ్యాయి. ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతుల ఏడాది వయసు ఉన్న పాప ప్రస్తుతం అనాథగా మారింది. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని లోనీ బోర్డర్ ప్రాంతంలో జరిగింది. విజయ్ ప్రతాప్ చౌహాన్ (32) , అతని భార్య శివాని (28) మధ్య గొడవ విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఘజియాబాద్‌లోని జవహర్ నగర్‌లోని జి బ్లాక్‌లో నివసించే విజయ్, శివానీల మధ్య శుక్రవారం సాయంత్రం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తరువాత, శివానీ ఈశాన్య ఢిల్లీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆమె వెళ్లిన సమయంలో విజయ్ ఫోన్ చేసి, ఇక ఎప్పటికీ తనను చూడలేవని చెప్పాడు.

Read Also: BCCI Review Meeting: బీసీసీఐ సమీక్ష సమావేశం.. తేలనున్న సీనియర్ ఆటగాళ్ల, కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యం?

కొద్దిసేపటి తర్వాత విజయ్ అత్త మీరా అతడి ఇంటికి వెళ్లి చూడగా, ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని భార్య శివానీకి తెలియజేశారు. భర్త మరణ వార్త విన్న శివానీ తన నివాసం నుంచి 8 కి.మీ దూరంలో ఉన్న ఈశాన్య ఢిల్లీలోని రోనీ రౌండ్అబౌట్ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటనపై ఘజియాబాద్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఇద్దరి ఆత్మహత్యల స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఫోరెన్సిక్ రెండు ప్రాంతాల్లో పరిశీలించింది. ఉరివేసుకున్న గుర్తులు తప్ప శివానీ శరీరంపై ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు నిర్ధారించారు.

Show comments