NTV Telugu Site icon

Karnataka: కూతురి ప్రైవేట్ వీడియోలు వైరల్ చేసిన తండ్రి.. ఆత్మహత్యాయత్నం..

Man Circulates Daughter's Obscene Videos

Man Circulates Daughter's Obscene Videos

Karnataka: తండ్రిననే విషయం మరిచి అత్యంత హేయంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. సొంత కూతురి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియా సర్క్యూలేట్ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో భర్తపై భార్య ఫిర్యాదు చేసిందని పోలీసులు శనివారం తెలిపారు. తండ్రి చర్య కారణంగా 18 ఏళ్ల కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫినైల్ తాగిన యువతిని ఉడిపిలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.

Read Also: Anant Ambani Wedding: శుభ్ ఆశీర్వాద్‌కు హాజరైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్

తీర్థహళ్లికి చెందిన బంధువుల అబ్బాయిని ప్రేమిస్తుందని తండ్రి కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుమార్తె ప్రియుడిని ఇంటికి పిలిచి, అతడిపై దాడి చేసి, అతని మొబైల్ ఫోన్‌లో ఉన్న కూతురి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను బలవంతంగా డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీని తర్వాత అతను భార్య, కూతురుని కొట్టడంతో వారు గాయాలపాలయ్యారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో అమ్మాయి శుక్రవారం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనపై బాలిక తల్లి ఉడిపిలోని సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.