NTV Telugu Site icon

Crime: నుపుర్‌శర్మకు మద్దతు.. తలనరికి దారుణహత్య..

Man Beheaded By Two Men In Rajastan

Man Beheaded By Two Men In Rajastan

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల తాలూకు ప్రకంపనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మల్దాస్ వీధిలో జరిగింది. మృతుడు కన్హయ్యలాల్ టైలర్ వృత్తి చేసుకుంటూస జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు దుండగులు అతడ్ని కిరాతకంగా నరికి తల, మొండెం వేరు చేశారు. అనంతరం ఈ పని చేసింది తామే అని వీడియో విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా హెచ్చరికలు పంపారు.

దీంతో ఒక్కసారిగా ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్దాస్ వీధి ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అదనంగా 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. మరోవైపు, ఈ దారుణానికి పాల్పడిన అగంతకులు ఆ హత్యను స్వయంగా వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యను గొప్పగా చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందంటూ ఆ వీడియోలో హెచ్చరించినట్టు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటనను రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఖండించారు. ఈ హత్యతో సంబంధం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరూ సోషల్​ మీడియా షేర్​ చేయవద్దని కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా.. ఉదయ్​పుర్ జిల్లాలో 24 గంటలపాటు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ హత్యపై దర్యాప్తు చేపట్టినట్లు ఉదయ్‌పూర్ ఎస్పీ తెలిపారు. నిందితులు గౌస్ మహ్మద్, రియాజ్ మహ్మద్‌లను పోలీసులు అదుపులోకిి తీసుకున్నారు. వారిద్దరు ఉదయ్‌పూర్‌లోని సూరజ్‌పోల్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మరో వైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show comments