NTV Telugu Site icon

UP Serial Killer: వరసగా మహిళల్ని హత్య చేస్తున్న “సీరియల్ కిల్లర్” దొరికాడు..

Up Serial Killings Case

Up Serial Killings Case

UP Serial Killer: గతేడాది కాలంగా ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా మహిళల హత్యలు సంచలనంగా మారాయి. 40-45 ఏళ్ల మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు జరిగాయి. పంట చేలు, చెరుకు తోటల్లో పనిచేస్తున్న మహిళల గొంతుకు చీరని బిగించి, గొంతు నులిమి హత్యలు జరిగాయి. మొత్తం 13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు ఒకే విధంగా జరిగాయి. దీంతో హత్యలకు పాల్పడుతున్నది సీరియల్ కిల్లర్ అని పోలీసులు అనుమానించి ఇటీవల అనుమానితుడి స్కెచ్ విడుదల చేశారు.

Read Also: Kavitha: లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..!

ఇదిలా ఉంటే, శుక్రవారం సీరియన్ కిల్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు కులదీప్ కుమార్‌ను షాహి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మథియా ఒడ్డు నుండి ఒక సమచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాదాపు 35 ఏళ్ల వయసున్న కుమార్ ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు ఎస్పీ అనురాగ్ ఆర్య వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, డికాయ్ ఆపరేషన్, మొబైల్ డేటా విశ్లేషణ తర్వాత అరెస్ట్ జరిగినట్లు ఆయన వెల్లడించారు.

ఏడాది కాలంగా 8 హత్యలు జరిగిన తర్వాత పోలీసులు 300 మందితో 14 ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. ఇలా చేసిన తర్వాత కూడా ఈ ఏడాది జూలై నెలలో 45 ఏళ్ల అనిత అనే మహిళని ఇదే విధంగా చీరతో గొంతు నులిమి పొలంలో హత్య చేయబడింది. ఈ హత్యలను చేసింది సీరియల్ కిల్లరే అని, హత్యలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల్ని విచారించి నిందితుడి స్కెచ్‌ని పోలీసులు విడుదల చేశారు. తాజాగా నిందితుడి అరెస్ట్ జరిగింది.

Show comments