Site icon NTV Telugu

Bengal Gang Rape case: వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి..

Bengal Gang Rape Case

Bengal Gang Rape Case

Bengal Gang Rape case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న, ఒడిశాకు చెందిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందిగుడిని ఫిర్దౌస్ షేక్‌గా గుర్తించారు. మరో ఐదుగురిని సహ నిందితులుగా పేర్కొన్నారు. సహ నిందితుల్లో బాధితురాలి ప్రియుడు అయిన సహ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి న్యాయవాది పార్థా ఘోష్ మాట్లాడుూత.. సామూహిక అత్యాచార సంఘటనలో క్లాస్‌మేట్, ప్రధాన కుట్రదారుడు లేదా సూత్రధారి అని అన్నారు.

Read Also: Telangana: హరీశ్ రావు తండ్రికి భౌతిక గాయానికి కేసీఆర్ నివాళులు

ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని అక్టోబర్ 10న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ- ఆసుపత్రి వెలుపల ఉన్న అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనపై అధికార టీఎంసీని, సీఎం మమతా బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసింది. కోల్‌కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఈ సంఘటన జరగడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Exit mobile version