Drugs Party : మాదాపూర్‌లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
- వీకెండ్ పార్టీపై ఎస్ఓటీ రైడ్
- 9 మంది యువకులు అదుపులో
- ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం
- విజయవాడ నెట్‌వర్క్‌పై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్‌లో సాగుతున్న ఒక వీకెండ్ డ్రగ్స్ పార్టీని మాదాపూర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు అత్యంత చాకచక్యంగా దాడి చేసి భగ్నం చేశారు. మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో గల ‘MBS భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్స్’ లోని ఒక ఫ్లాట్‌లో కొందరు యువకులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే నమ్మకమైన సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఈ దాడులు నిర్వహించారు. వీకెండ్ కావడంతో ఈ డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేకంగా విజయవాడ నుండి కొందరు యువకులు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో పార్టీ ఆర్గనైజర్ అయిన దనేకుల తరుణ్ తేజతో పాటు మొత్తం తొమ్మిది మంది యువకులను పోలీసులు అక్కడికక్కడే పట్టుకున్నారు.
బెజవాడ కనెక్షన్.. రూ. లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
పోలీసుల ప్రాథమిక విచారణలో విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వి అనే వ్యక్తులు ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు తేలింది. వీరిద్దరూ దనేకుల తరుణ్ తేజ ద్వారా హైదరాబాద్‌లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలో నిందితుల నుండి ₹ లక్షల విలువైన 15 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి , 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆర్గనైజర్ తరుణ్ తేజను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్విల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు, ఈ ముఠాకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!