Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..

Download

Download

గ్రేటర్ నోయిడా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక లగ్జరీ జాగ్వార్ కారు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు రోడ్డుపై వెళ్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తాన్ని చుట్టుముట్టేసాయి. దీనివల్ల కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో మంటలు రావడం గమనించిన వెంటనే అందులోని ప్రయాణికులు అప్రమత్తమై, కారు నుండి కిందకు దూకేసి సురక్షితంగా బయటపడ్డారు.

×
×
Ad

ఈ లగ్జరీ కారులో అగ్నిప్రమాదం సంభవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు వాహనాల నుంచి అసాధారణమైన పొగ లేదా శబ్దాలు వస్తే వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి తనిఖీ చేసుకోవడం ఎంతో సురక్షితం.