Kurnool Murder: కర్నూలులో పట్టపగలే మర్డర్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని అతి దారుణంగా హత్య చేశారు. బంగారు ఆభరణాలు ఎత్తుకుని వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి వృద్ధురాలు రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శివలీల అనే వృద్ధురాలు ఇంట్లో కిచెన్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మారణయుధాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు, ఇతర నగలు దోచుకొని ఉడాయించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శివలీల అల్లుడు ఇంటికి వచ్చాడు. అప్పటికే హత్యకు గురైంది వృద్ధురాలు. ఇంకా ప్రాణాలతో ఉందేమోనన్న అనుమానంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ జగిలాలను తీసుకువెళ్లి పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు…
READ ALSO: Visakhapatnam : డ్రగ్స్ వినియోగంలో ఏపీలో వేగంగా విస్తరిస్తున్న విశాఖ.. ఆందోళనలో అధికారులు
పథకం ప్రకారం హత్య..
రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాంబశివారెడ్డి భార్య శివలీల 15 ఏళ్లుగా సాయివైభవ్ కాలనీలో నివసిస్తున్నారు. సాంబశివారెడ్డికి ఒక కొడుకు, కుమార్తె. కుమారుడు అమెరికాలో ఉండగా కుమార్తె స్థానికంగా ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం సాంబశివారెడ్డి మృతి చెందారు. కుమార్తె, అల్లుడుతో కలసి శివలీల అక్కడే ఉంటోంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో శివలీల ఇంటిముందు కూర్చుని ఉండగా స్థానికులు చూసినట్టు చెబుతున్నారు. అంటే ఉదయం 9 గంటల తరువాత మధ్యాహ్నం 2 గంటల మధ్యలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే పట్టపగలు వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. శివలీల అల్లుడు రావడానికి అరగంట ముందు దుండగులు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వృద్ధురాలు ఏ సమయంలో ఒంటరిగా ఉంటుందో బాగా గమనించిన వాళ్లే పథకం ప్రకారం హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు…
పనిపనిషి మీద కుటుంబ సభ్యుల అనుమానం
శివలీల హత్యపై ఇంట్లో పనిపనిషి మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే కొత్త పనిమనిషిని ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజులుగా ఆమెను పనికి వద్దని శివలీల చెప్పినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. హత్య జరగడానికి ముందు కొత్త పని మనిషి శివలీల కూతురుకు ఫోన్ చేసింది. పాత పనిమనిషి వచ్చిందా? నేనే రావాలా? అంటూ శివలీల కూతురుతో కొత్త పనిమనిషి మాట్లాడినట్టు చెబుతున్నారు. శివలీల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్టు పనిమనిషి పాత్ర ఉందా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 2 నెలల క్రితం హత్య జరిగిన ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో 50 తులాల బంగారు చోరీ జరిగింది…
READ ALSO: Bhupalpally Crime: నైస్‌గా భర్తను హత్య చేసింది.. సొంత కూతురిని చంపేసింది.. సంసారం.. ఓ చదరంగం
