Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- మక్తల్‌లో కృష్ణ జింకల వేట కలకలం
- ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఆయుధాల స్వాధీనం
- 12 జింకలు, 4 నెమళ్ల హత్య బయటపడ్డ నిజాలు
- వన్యప్రాణుల సంరక్షణపై టాస్క్ ఫోర్స్ కఠిన నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Deer Hunting : నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కలకలం రేపింది. కృష్ణ జింకలను వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మక్తల్ ప్రాంతంలో జింకలను వేటాడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ వేటలో పాల్గొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లైసెన్స్‌డ్ రైఫిల్ తో పాటు 3 ఎయిర్ గన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలను అంగీకరించారు. ఇప్పటివరకు తాము 12 కృష్ణ జింకలను, 4 నెమళ్లను కాల్చి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కేవలం వినోదం కోసమో లేదా ఇతర అవసరాల కోసమో ఈ మూగజీవాలను బలితీసుకున్నట్లు తెలుస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం పోలీసులు గట్టి నిఘా ఉంచారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసును అటవీ శాఖ అధికారులకు అప్పగించి, తదుపరి విచారణను వేగవంతం చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!