Cyber Fraud: ఓ సైబర్ నేరగాని పోలీసులు వెంటాడి వెంటాడి నేరాల పుట్టను రట్టు చేసిన సంఘటన కామపల్లిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి కి చెందిన గడబోయిన హరీష్ గత కొంతకాలంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఫేక్ ఐడీలను సృష్టించి అనేక మంది వద్ద డబ్బులను తన ఎకౌంట్లో జమ చేసుకోవడం ప్రధాన ఉత్తిగా మారింది.
హరీష్ ఇంటి వద్ద ఉంటూ టెంట్ హౌస్ తో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ ను నడిపిస్తూ మరోవైపు అతి తొందరలో కోటీశ్వరుని కావాలనే ఆలోచనతో ఈ సైబర్ నేరాల దందాకు పాల్పడుతున్నాడు. గూగుల్లో టెంపరరీ మెయిల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇంస్టాగ్రామ్ లో బ్రేక్ ఐడీలతో డిఫరెంట్ వ్యక్తులను పరిచయం చేసుకొని వారి నుండి డబ్బులు వేర్వేరు అకౌంట్లో జమ చేసుకుంటున్నాడు. ప్రొఫైల్ పిక్ సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలతో చాటింగ్ చేసి తన వద్ద పనిచేసే మధు అనే వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు జమ చేశాడు..216 ఫేక్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేశాడు.
సుమారు నాలుగు లక్షల డబ్బులను జమ చేసుకున్నాడు. గతంలో తన బంధువుల అమ్మాయిని మోసం చేశాడు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు కూడా నమోదు చేశారు. మళ్లీ అదే విధంగా తన సైబర్ నేరాలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. హరీష్ పరార్ లో ఉన్నాడు. పోలీసులు వెంటాడు వెంటాడు చివరికి ఖమ్మంలో అరెస్టు చేశారు. కోర్టుకు రిమాండ్ కూడా చేశారు.
TG Inter Board : ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు.? భాషా సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు.!
