Site icon NTV Telugu

Kerala: ప్రియుడి ఆకృత్యం.. క్రూరమైన లైంగిక దాడిలో ప్రియురాలి మృతి

Kerala

Kerala

కేరళలో మరో దారుణం వెలుగుచూసింది. రోజురోజుకు మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ప్రియుడి ఘాతుకానికి ప్రియురాలు హతమైంది. ఈ ఘోరం కేరళలోని చొట్టనిక్కరలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Great Khali: కుంభమేళాలో మాజీ రెజ్లర్ గ్రేట్ ఖలీ పుణ్యస్నానం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు

19 ఏళ్ల బాలిక ప్రియుడిచే క్రూరమైన లైంగిక వేధింపుల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం చనిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రియుడు పెట్టిన వేధింపుల కారణంగానే బాలిక చనిపోయిందని పేర్కొన్నారు. గత సోమవారం కేరళలోని చొట్టనిక్కరలోని తన ఇంట్లో బాలిక తీవ్రంగా గాయపడి ఉంది. అయితే ప్రియుడి వేధింపుల కారణంగా తీవ్రంగా గాయపడింది. దీంతో బాలికను ప్రైవేటు ఆస్పత్రిలో చేరిపించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందింది. అయితే శుక్రవారం పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈనెల 26న ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. పోస్టుమార్టం తర్వాత.. వైద్యుల వాంగ్మూలం ప్రకారం యువకుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు చొట్టనిక్కర పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శారీరక దాడి మరియు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: RK Roja: సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలి?

Exit mobile version