Site icon NTV Telugu

Chicken: ఎక్స్‌ట్రా “చికెన్” కావాలన్నందుకు ఫ్రెండ్‌నే చంపేశాడు..

Crime

Crime

Chicken: ఇటీవల కాలంలో ఆహార విషయంలో గొడవలు హత్యలకు కారణమవుతున్నాయి. పలు సందర్భాల్లో చిన్నపాటి వివాదాలు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో ఎక్స్‌ట్రా చికెన్ డిమాండ్ చేసినందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది.

Read Also: Ileana : అమ్మకి ఫోన్ చేసి ఏడ్చా.. సినిమా వదిలేయాలని అనుకున్నా

యారగట్టి తాలూకాకు చెందిన బాధితుడు వినోద్ మలశెట్టి(30) అతడి స్నేహితుడి పెళ్లి పార్టీలో హత్యకు గురయ్యాడు. అభిషేక్ కొప్పాడ్ నిర్వహించిన పార్టీకి వినోద్ వెళ్లాడు. ఆదివారం అభిషేక్ పొలంలోనే ఈ పార్టీ జరిగింది. వినోద్ ఆహారం వడ్డిస్తున్న విట్టల్ హరుగోప్ నుంచి మరింత చికెన్ కావాలని అడిగాడు. అయితే, ఆహారం చాలా తక్కువగా ఉందని వినోద్ ఫిర్యాదు చేశాడు. ఇది వినోద్, విట్టల్ మధ్య వివాదానికి దారి తీసింది. కోపంతో విట్టల్ ఉల్లిపాయలు కోసే కత్తితో వినోద్‌ను పొడి చంపాడు. తీవ్ర రక్తస్రావంతో వినోద్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version