Site icon NTV Telugu

Tragedy : జగిత్యాలలో ప్రేమకథ దారుణాంతం.. సినిమా స్టైల్లో..!

Murder

Murder

Tragedy : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ (25)ను, అతని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె బంధువులు పలుమార్లు హెచ్చరించారు. ఆ యువతికి మరో వివాహ సంబంధం చూస్తున్న నేపథ్యంలో, ఈ ప్రేమను కొనసాగించొద్దని సతీష్‌ను వారించారు.

AP Floods : కృష్ణ, గోదావరి నదుల ఉగ్రరూపం… రెండో ప్రమాద హెచ్చరిక జారీ

అయితే కలత చెందిన సతీష్, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యువతి ఫొటో పెట్టి, తాను ప్రేమిస్తున్నానని ప్రకటిస్తూ, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరాదని సందేశం పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి బంధువులు, శనివారం రాత్రి సతీష్ ఇంటి దగ్గరికి వెళ్లి కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాల కారణంగా సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల గ్రామీణ పోలీసు ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం – ముగ్గురు నిందితులు నథారి వినంజీ, శాంత వినంజీ, జలాల్పై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించగా, నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

AP Floods : కృష్ణ, గోదావరి నదుల ఉగ్రరూపం… రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Exit mobile version