Site icon NTV Telugu

Indian Student Arrested: స్టోర్ లో దొంగ‌త‌నం చేస్తూ పట్టుబడిన మరో భారతీయ విద్యార్థిని..

Untitled Design (9)

Untitled Design (9)

అమెరికాలోని ఓ స్టోర్ లో దొంగతనం చేస్తూ.. మరో భారతీయ విద్యార్థిని పట్టుబడింది. యువతిని పట్టుకున్న స్టోర్ కీపర్ పోలీసులుకు కంప్లైంట్ చేశారు. దీంతో విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాను ఎలాంటి చోరీ చేయడం లేదని.. కేవలం డబ్బులు చెల్లించడం మర్చిపోయానని యువతి వాపోయింది. అయినప్పటికి యువతి మాటలు వినని అమెరికా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read Also:Liver Issue: ఫ్యాటీ లివర్ తో బాధపడుతన్నారా.. ఈ చిట్కా పాలో అవ్వండి..

వీడియోలో ఓ పోలీసు అధికారి .. తాను చేసిన దొంగతనాన్ని ఒప్పుకోవాలని ఆమెకు తెలిపాడు. విద్యార్థిని మాత్రం తాను ఎలాంటి దొంగతనానికి పాల్పడలేదని .. డబ్బులు కట్టడం మర్చిపోయానని ఏడుస్తూ.. పోలీస్ ను వేడుకుంది. అయినా కూడా ఆ పోలీస్ మనసు కరగలేదు. పైగా నిజం ఒప్పుకోక పోతే బేడీలు వేస్తానని బెదిరించాడు. గతంలో కూడా భారతీయ యువతి చోరీ చేస్తూ పట్టుబడింది. అయినా చాలామంది మార్పు రావడంలేదని.. ఇతర దేశాల్లో మన దేశం పరువు తీస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Exit mobile version