Site icon NTV Telugu

అర్ధరాత్రి అతడి కారు ఎక్కిన యువతి.. అది చూపించి ఆమెపై

ప్రపంచంలో స్నేహితులను నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేరు.. వారితోనే అన్ని షేర్ చేసుకుంటారు. కానీ, ఈ కాలంలో కొంతమంది చేసే కొన్ని పనులు స్నేహాన్ని కూడా నమ్మలేకుండా చేస్తున్నాయి. ఫ్రెండే కదా అని నమ్మి లిఫ్ట్ ఇవ్వమంటే.. అతడు అమ్మాయి దొరికింది కదా అని కామ బుద్ది చూపించాడు. యువతిని కారులో ఎక్కించుకొని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. మొహాలీకి చెందిన ఒక యువతి అక్టోబర్ 29న తన పని ముగించుకొని బర్నాలా నుంచి తాను ఉంటున్న పీజీ హాస్టల్ కి బయల్దేరింది. రాత్రి సమయం కావడంతో బస్సులు లేక, తన స్నేహితుడైన కుష్వీందర్ కు ఫోన్ చేసి తనను పీజీ దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా కోరింది. కొద్దిసేపటి తర్వాత కుష్వీందర్ కారులో తనను ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. యువతి భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా, అతడి దగ్గర ఉన్న తుపాకీ తీసి చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి రోడ్డుపక్కన వదిలేసి పరారయ్యాడు. దీంతో యువతి క్యాబ్ బుక్ చేసుకొని పీజీవసతి గృహానికి చేరుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version