Site icon NTV Telugu

Constable Suicide: కానిస్టేబుల్‌గా క్రిమినల్స్‌తో పోరాడింది.. కానీ భర్త వేధింపులకు బలైంది..?

Susaid

Susaid

Woman Constable Suicide: ఓ మహిళా కానిస్టేబుల్‌గా.. ఆమె క్రిమినల్స్‌తో పోరాడింది.. కానీ సొంత ఇంట్లో సమస్యలతో పోరాడేందుకు ధైర్యం సరిపోలేదు. అలా అని పోలీసు ఉన్నతాధికారులతోనూ తన సమస్యను చెప్పుకోలేదు. ఫలితంగా సమస్యకు తలొగ్గి జీవితాన్ని త్యజించింది. హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

READ MORE: Hyderabad: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్.. స్టాక్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం..!

జనానికి కష్టం వస్తే.. పోలీసులు… మేమున్నామని భరోసా ఇస్తారు. మరి అలాంటిది వారికే కష్టం వస్తే ధైర్యంతో ఎదుర్కునేందుకు ప్రయత్నిస్తారు. కొంత మంది ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించుకుంటారు. మరికొంత మంది సమస్యతో పోరాడే ధైర్యం లేక ప్రాణాలు వదిలేస్తున్నారు.. తాజాగా హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పేరు మనీషా. ఈమె మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో గత ఐదేళ్లుగా పని చేస్తోంది. చాలా మంది ఇళ్లల్లో ఉన్న విధంగానే ఈమె ఇంటిలోనూ కుటుంబ సమస్యలు ఉన్నాయి.

READ MORE: CM Chandrababu: ఇవాళ నా జీవితంలో హ్యాపీయెస్ట్ డే.. ఎందుకంటే..?

కుటుంబ కలహాల కారణంగా వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వారం రోజుల నుంచి నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కానీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మృతి చెందింది. ఐతే ఆమె మృతికి భర్త వేధింపులే కారమని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కేర్ ఆస్పత్రి వద్దే ఆందోళనకు దిగారు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు ఏం జరిగిందనేది బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు..

Exit mobile version