Site icon NTV Telugu

Shocking : కేపీహెచ్‌బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

Fight

Fight

Shocking : హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పరిధి రోడ్ నెంబర్ వన్ లో ఘర్షణాత్మక సంఘటన చోటుచేసుకుంది. వేశ్య రవళి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధు గౌడ్ మధ్య వివాదం దారుణ ఘటనకు దారితీసింది. సమాచారం ప్రకారం, రవళిని బుక్ చేసుకునే క్రమంలో మధు గౌడ్‌తో వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని రవళి తన మరది సోహైల్‌కి తెలిపింది. అనంతరం సోహైల్ తన అనుచరులు చర్పట్ శశి అండ్ గ్యాంగ్‌తో కలిసి అక్కడికి చేరుకుని మధు గౌడ్‌పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన మధు గౌడ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతని తండ్రి పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు సోహైల్, చర్పట్ శశి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Oracle Layoffs : సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలేనా?.. భారతీయ ఉద్యోగులపై ఒరాకిల్ పిడుగు..

Exit mobile version