Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
- హనీట్రాప్ నిందితుడు పవన్ అరెస్ట్..
- 82 మంది పోలీసులే బాధితులు..
- 47 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు..
- డీఐ నుంచి రూ.10 లక్షల వరకు వసూలు..
- వెయ్యికి పైగా బాధితులు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందమైన అమ్మాయి ముసుగు.. తీయని మాటల వలపు వల.. తీరా ఆ ఊబిలో దిగాక అందినకాడికి బ్లాక్‌మెయిలింగ్! అమాయకులను బుట్టలో వేసే సైబర్ నేరగాడు ఏకంగా చట్టాన్ని కాపాడే పోలీసులనే టార్గెట్ చేసి నిలువునా ముంచేశాడు. ఒకరా ఇద్దరా.. ఏకంగా 82 మంది పోలీసు అధికారులను తన మాయాజాలంలో బంధించాడు. ఈ బాగోతంలో ఒక ఇన్స్పెక్టర్ ఉద్యోగం కోల్పోయి ఊచలు లెక్కపెడుతుండగా, మరో ఏసీపీ విచారణను ఎదుర్కొంటున్నారు. సంచలనం సృష్టించిన ఈ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ హనీట్రాప్ రాకెట్ గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేసి, ప్రధాన సూత్రధారి కొండబత్తుల పవన్‌కుమార్ రావును అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పవన్‌కుమార్ తన మాజీ ప్రియురాలితో చేతులు కలిపి ఈ వలపు సామ్రాజ్యాన్ని నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 33, ఫేస్బుక్లో 14 నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, అందమైన అమ్మాయిల ఫోటోలను డిస్ప్లేగా ఉంచాడు. ముఖ్యంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. అవతలి వ్యక్తి స్పందించగానే శృంగార సంభాషణలు మొదలుపెట్టేవాడు.
Also Read
- Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
- Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
- Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో బాధితుల ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం చేసేవాడు. ఆ తర్వాత “మీ బాగోతాన్ని సోషల్ మీడియాలో పెడతాం.. డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసి ఉద్యోగం తీయిస్తాం” అంటూ బెదిరింపులకు దిగి లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. చాట్ చేస్తున్నది అమ్మాయి కాదని తెలిసిన తర్వాత కూడా కొందరు అధికారులు అతనితో నిరంతరం చాటింగ్ సాగించడం గమనార్హం.
ఈ ఉచ్చులో అత్యంత దారుణంగా చిక్కుకున్న ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) బాలస్వామి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ‘చందన’ అనే నకిలీ పేరుతో సోషల్ మీడియా ఖాతా తెరిచిన పవన్.. ఆమె తన బంధువని, ఆమెతో పెళ్లి జరిపిస్తానని బాలస్వామిని నమ్మించాడు. అసలు చందన అనే వ్యక్తే లేనప్పటికీ.. ఆమెకు తీవ్ర అనారోగ్యంగా ఉందని నమ్మించి వైద్య ఖర్చుల పేరిట డీఐ నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు గుంజాడు.
అంతటితో ఆగకుండా బాలస్వామిని భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా దాదాపు ఆరు నెలల పాటు ఓ లాడ్జిలోనే ఉంచి మానసికంగా వేధించాడు. ఇంటికి వెళితే అక్రమ కేసులు పెట్టి ఉద్యోగం ఊడేలా చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. బాధితుడి భార్య గంజి హరిత ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం డీఐ బాలస్వామి ఈ సంబంధిత వివాదాల నేపథ్యంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్నారు.
నిందితుడు పవన్‌కుమార్ చేతిలో మోసపోయిన వారి సంఖ్య వెయ్యి దాటినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారు. ఈ నెట్వర్క్ సరిహద్దులు దాటి యూఏఈ, ఒమన్, పాకిస్థాన్, కెన్యా దేశాల వరకు విస్తరించడం అధికారులను సైతం నివ్వెరపరిచింది. మొత్తం బాధితుల్లో 82 మంది పోలీస్ డిపార్ట్మెంట్కు చెందినవారే కావడం గమనార్హం. నిందితుడి బ్యాంక్ ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ దందాలో పవన్‌కు సహకరించిన కవితతో పాటు ఇతర ముఠా సభ్యుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!