NTV Telugu Site icon

Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

Gold Rate Today

Gold Rate Today

ఇటీవల హైదరాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరోసారి బంగారాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 1.88 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారంనాడు సీజ్ చేశారు. జెడ్డా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు ఇవాళ ఈ బంగారాన్ని సీజ్ చేశారు.. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా కోటికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు..

గత ఏడాది లో కూడా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. గత ఏడాది ఆగస్టు 14న రూ. 13.63 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. లో దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు ప్రయాణీకుడిని అడ్డుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 6 వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువల రూ. 3.5 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు..

అలాగే ఈ ఏడాది కూడా జూలై లో . 1.27 కోట్ల విలువైన 1.93 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. క్యాప్యూల్స్ రూపంలో బంగారాన్ని తీసుకు వచ్చిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్రమార్కులు కొత్త కొత్త మార్గం లో బంగారాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చీరకు బంగారాన్ని స్ప్రే చేసి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం అతడిని అదుపులో కి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.. చీరలో తరలిస్తున్న బంగారం విలువ రూ.80 లక్షలు ఉంటుందని అంచనా..